రోజర్ బిన్నీ స్థానంలో మిథున్ మన్హాస్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : దిల్లీ మాజీ కెప్టెన్‌ మిథున్‌ మన్హాస్ (Mithun Manhas) బీసీసీఐ అధ్యక్షుడి (BCCI President)గా నియమితులయ్యారు. ముంబయి (Mumbai)లో తాజాగా జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో మిథున్​ను అధ్యక్షుడి ఎన్నికున్నారు. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా కొనసాగనున్నారు. ట్రెజరర్​గా రఘురామ్‌భట్, జాయింట్‌ సెక్రటరీగా ప్రభుతేజ్‌సింగ్ భాటియా ఎంపికయ్యారు. సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీల తర్వాత ఈ అత్యున్నత పదవిని అలంకరించిన మూడో మాజీ క్రికెటర్‌గా 45 ఏళ్ల మన్హాస్ నిలిచారు.

గత ఆగస్టు నెలలో రోజర్ బిన్నీ(Roger Binny) తన పదవికి రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. అప్పటి నుంచి రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిథున్ మన్హాస్ పేరును జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నామినేట్ చేసింది. అతడి పేరు అనూహ్య రీతిలో తెరపైకి వచ్చింది. ఇటీవల బోర్డు సమావేశం అనంతరమే మిథున్ మన్హాస్ కూడా ఈ రేసులోకి వచ్చాడు. తాజాగా ఏజీఎంలో ఆయన ఎన్నికను ఖరారు చేశారు.

ఒక్క మ్యాచ్ ఆడ‌కుండానే..
కెరీర్ ప్రారంభంలో మన్హాస్ రంజీల్లో దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 9714 పరుగులు చేశారు. ఇందులో 27 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత ఐపీఎల్​లో 55 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగారు. ఆనంతరం దిల్లీ డేర్​డెవిల్స్, పూణె వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్​గా పనిచేశారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో పనిచేస్తున్నారు. డొమెస్టిక్​లో కొంత క్రికెట్ ఆడిన మిథున్, అంతర్జాతీయ క్రికెట్​లో మాత్రం అరంగేట్రం చేయలేదు.

దేశ‌వాళీ క్రికెట్‌లో…
ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న మన్హాస్, ఆ తర్వాత జమ్మూకశ్మీర్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించి కోచ్‌గా సేవలు అందించారు. తన కెరీర్‌లో 147 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 9,714 పరుగులు చేశారు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, పుణె వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడారు. క్షేత్రస్థాయిలో క్రికెట్‌పై ఉన్న అవగాహన, సౌమ్యుడిగా పేరున్న మన్హాస్ నియామకం భారత క్రికెట్‌కు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply