తాత్కాలిక ప్రెసిడెంట్​గా రాజీవ్ శుక్లా?

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ (BCCI President Roger Binny) షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (BCCI Vice President Rajiv Shukla) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో జరగనున్న బీసీసీఐ ఎన్నికల వరకు శుక్లా ఈ పదవిలో కొనసాగుతారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో రోజర్ బిన్నీ మళ్లీ పోటీ చేసి గెలిస్తే అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో సెప్టెంబర్ తర్వాత బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రానున్నారు.

ఇటీవల పార్లమెంటులో కొత్త జాతీయ క్రీడా పాలన చట్టం (National Sports Governance Act) ఆమోదం పొందినప్పటికీ, అది పూర్తిగా అమల్లోకి రావడానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కారణంగా సెప్టెంబర్‌లో జరిగే బీసీసీఐ ఎన్నికలు, ప్రస్తుతం సుప్రీంకోర్టు (Supreme Court)ఆదేశాల మేరకు లోధా కమిటీ సిఫార్సులతో రూపొందించిన రాజ్యాంగం ప్రకారమే జరుగుతాయని తెలిసింది. ఈ పాత నిబంధనల ప్రకారం, ఆఫీస్ బేరర్ల వయోపరిమితి 70 ఏళ్లుగా ఉండగా, కొత్త చట్టంలో దానిని 75 ఏళ్లకు పెంచే అవకాశం కల్పించారు.

Leave a Reply