Bapatla | సినీ ఫక్కీలో.. దోపిడీ ముఠా పట్టివేత

Bapatla | సినీ ఫక్కీలో.. దోపిడీ ముఠా పట్టివేత

  • బాపట్లలో బొంబాయి గ్యాంగ్ అరెస్ట్

Bapatla | బాపట్ల టౌన్ , ఆంధ్రప్రభ : సినీ ఫక్కీలో.. బాపట్ల జిల్లా పోలీసులు మహారాష్ట్ర దోపిడీ ముఠాను ఛేజ్ చేసింది. ఏకకాలంలో ఓ రైలులోని అన్ని బోగీల్లోనూ జల్లెడ పట్టి డెకాయిట్ గ్యాంగ్ ను పట్టుకున్నారు. బాపట్ల పోలీసుల స్పెషల్ ఆపరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర హింగోలి జిల్లా పరిధిలోని రాష్ట్ర మధ్యవర్తి సహకారి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ వద్ద నుండి రూ.8 లక్షలు దోచుకుని ఓ ముఠా పారిపోతోందని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ కు సమాచారం వచ్చింది.

తక్షణమే తమ సిబ్బందిని ఎస్పీ అప్రమత్తం చేశారు. బాపట్లచ చీరాల రైల్వేస్టేషన్లలో పోలీసుల్ని రంగంలోకి దించారు. బాపట్ల రైల్వే స్టేషన్ కు కృష్ణా ఎక్స్ ప్రెస్ చేరుకోగానే ఏకకాలంలో అన్ని బోగీలను పోలీసు బృందాలు తనిఖీ చేశాయి. ఓ బోగిలో 5డురు ముఠా సభ్యులు దొరికారు. ఈ డెకాయిట్ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్నారు.

రూ.6,72,700 -నగదు, ఒక్క కత్తి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ డీఎస్ పి జగదీష్ నాయక్, బాపట్ల పట్టణ సీఐ రాంబాబు, ఎస్ఐ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, పాల్గొన్నారు. ఆపరేషన్ దిగ్విజయంగా నిర్వహించి డెకాయిట్ గ్యాంగ్ ను పట్టుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం ను ఎస్ పి ఉమామహేశ్వర్ అభినందించారు.

Leave a Reply