బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం
జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం
ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం అని జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య లు అన్నారు. ఆదివారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్నబాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య లు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి, వెనుకబడిన తరగతుల సాధికారతకు చిహ్నం, భావితరాలకు స్ఫూర్తిదాయకం . బాబు జగజ్జీవన్ రామ్ నిలిచారన్నారు.
బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి, ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అందరికీ ఆదర్శమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుడిగా, దేశ మాజీ ఉప ప్రధానిగా ప్రజాహిత నాయకుడిగా దేశానికి విశేష సేవలందించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ కొండయ్య, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్ తులసి కృష్ణారావు, మేక వెంకటేశ్వర్లు, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మున్సిపల్ కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి,మైనేని రాధాకృష్ణ, నకిర కంటి వెంకట్, కర్ల జోజి, ఆదిమల్ల వెంకన్న, అన్నెపాక దుర్గా మహేశ్వరరావు, కట్టా వెంకట నరసింహారావు, ధూళిపాళ్ల లక్ష్మణరావు, సంగెపు బుజ్జిబాబు, ఇర్రి నరసింహారావు, పేరం సైదేశ్వరరావు, నూకల సాంబ, సూర్యదేవర రాంప్రసాద్, వేదులపురి సైదా, షేక్ మదార్,మారేపల్లి శౌరి, తాటి రామారావు, కటికల అనిల్, బొబ్బిళ్ళ పాటి ప్రసాద్, రాయల మోహన్ రావు, దేవరకొండ ఆనంద్, శ్యామలక్, నటుకుల రవి, రాయల కుటుంబరావు, కోట ప్రబోజీ, వల్లపుదాసు తిరుపతిరావు, మీసాల చిట్టిబాబు, శామ్యూల్, అన్నెపాక నాగయ్య, పల్లెపోగు ప్రభుదాస్, ఎండ్రాతి వెంకటేశ్వర్లు, స్థానికులు పాల్గొన్నారు
