Bank | అవినీతి పై చర్యలు తీసుకోవాలి….

Bank | అవినీతి పై చర్యలు తీసుకోవాలి….

Bank | బోధన్, ఆంధ్ర ప్రభ : బోధన్ పట్టణంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకు వినతి పత్రం అందజేశారు. స్వయం సహాయక సంఘాలను పర్యవేక్షించే రిసోర్స్ పర్సన్ సభ్యులకు చెందిన లక్షలాది రూపాయల సొమ్ము స్వాహా చేసినట్లు వివరించారు. రాకాసి పేట్ లోని కౌడిన్య మహిళా పొదుపు సంఘానికి 7,50,000 ఋణం మంజూరు అయినది.

ఈ సొమ్ము తిరిగి బ్యాంకుకు చెల్లించే సమయంలో ఆర్ పి చేతి వాటం ప్రదర్శించినట్లు వివరించారు. సభ్యుల నుంచి ప్రతి నెల సొమ్ము తీసుకోని వాటిని బ్యాంకులో చెల్లించ కుండా స్వంతానికి వాడుకుందన్నారు. ఈ విషయమై పట్టణ మెప్మా అదికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో స్వయం సహాయక సంఘాల మహిళలు సావిత్రి, భాగ్య, అరుణ, శోభ తదితరులు ఉన్నారు.

Leave a Reply