Bangladesh Unrest : హింసాకాండ

Bangladesh Unrest : హింసాకాండ

  • పత్రిక కార్యాలయాల ధ్వంసం
  • భారత రాయభారి ఇంటిపై రాళ్లదాడి
  • ఓ హిందువు దారుణ హత్య
  • మృతదేహం దహన యత్నం
  • మూకల దాడుల్ని అడ్డుకోండి : తాత్కాలిక ప్రధాని యూనస్​
Bangladesh Unrest

( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ)  

బంగ్లాదేశ్ (Bangladesh Unrest) ​ అట్టుడుగుతోంది. మూక దాడులతో ( Mob Violance) అల్లకల్లోలమైంది. ఒక వైపు భవనాల పై దాడి. విధ్వంస కాండలో మూకలు చెలరేగిపోతున్నాయి. అంతర్జాతీయ సమాజం సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణంతో .. జనంలో రగిలిన ఆందోళన.. కాస మత దాడిగా అవతరించింది.

Bangladesh Unrest

గురువారం అర్ధరాత్రి నుంచి బంగ్లాదేశీయులు అల్లాడిపోతున్నారు. గురువారం రాత్రి రెండు ప్రధాన దినపత్రికల (Media Offices)  కార్యాలయాలపై మూక దాడి జరిగింది. శుక్రవారం ఉదయం భారత రాయభార కార్యాలయంపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ అలజడిపై బంగ్లాదేశ్​ తాత్కలిక ప్రధాని యూనస్ (PM Yunus) ​ తీవ్రంగా స్పందించారు. మూకల విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్​లో ఉద్రిక్త పరిస్థితులపై  భారత పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపింది. బంగ్లాదేశ్​లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.

Bangladesh Unrest :  ప్రత్రిక కార్యాలయాల దహనం

 గురువారం అర్థరాత్రి నుంచి  బంగ్లాదేశ్ హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతోంది, జాతీయ ఎన్నికల  నేపథ్యంలో బంగ్లాదేశ్​లో మరింత అశాంతి చెలరేగుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన  తిరుగుబాటు  విద్యార్థి నాయకుడు  షరీఫ్ ఉస్మాన్ హదీన్    గత శుక్రవారం ఢాకాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు ముసుగు దుండగులు ఆయనను  కాల్చారు.  మెరుగైన వైద్యం కోసం హాదీని సింగపూర్‌కు తరలించారు, అక్కడ ఆరు రోజులు  చావుబతుకుల్లో కొట్టిమిట్టాడిన  (Shariff Usman Hadin)  ఆయన (Dead)  మరణించారు.

Bangladesh Unrest

ఈ సమాచారంతో  బంగ్లాదేశ్​ లో అలజడి రేగింది.  గురువారం నిరసన మూకలు  వీధుల్లోకి వచ్చి    పత్రికల కార్యాలయాలపై దాడి దిగారు.  బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం  32 ధన్మండిని ధ్వంసం చేశారు.  రాజధాని ఢాకాలో  అనేక భవనాలు, ప్రముఖ వార్తాపత్రికలు ప్రోథోమ్ అలో (Prthom Alo)  ,  డైలీ స్టార్‌  భవనాలను  ధ్వంసం చేశారు.  నిప్పంటించారు.  అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శుక్రకారం తెల్లవారుజామున 1.40 గంటల ప్రాంతంలో  డైలీ స్టార్ (Daily Star)  భవనంలోని మంటలను  అగ్నిమాపక సిబ్బంది  అదుపులోకి తెచ్చారు,

Bangladesh Unrest

27 మంది ఉద్యోగులను రక్షించారు. “వార్తాపత్రిక చరిత్రలో మొదటిసారిగా, ప్రచురణను నిలిపివేయాల్సి వచ్చింది” అని కన్సల్టింగ్ ఎడిటర్ కమల్ అహ్మద్  తెలిపారు. ప్రోథోమ్ అలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సజ్జాద్ షరీఫ్ ఈ దాడి మాట్లాడుతూ, పత్రికా స్వేచ్ఛ, వ్యక్తీకరణ, అసమ్మతి  అభిప్రాయ వైవిధ్యంపై దాడి జరిగిందన్నారు. ఈ  హింస అంతర్జాతీయ ఆందోళనకు దారితీసింది. జర్నలిస్టులను రక్షించే కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.  జర్నలిస్టుల భద్రతకు చర్యలు చేపట్టాలని   బంగ్లాదేశ్ అధికారులను ఈ కమిటీ  కోరింది.

Bangladesh Unrest  : హైకమిషనర్​ ఇంటిపై దాడి

  తెల్లవారుజామున 1:30 గంటలకు చటో గ్రామ్‌లోని (Chato gram) అసిస్టెంట్ ఇండియన్ హైకమిషనర్ ఇంటిపై  ఇటుకలు, రాళ్లను (Pelt Stones) విసిరారు, కానీ ఎటువంటి నష్టం జరగలేదు.  పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.  లాఠీ ఛార్జ్‌లతో  నిరసన మూకల్ని  చెదరగొట్టారు. , 12 మంది   అదుపులోకి తీసుకున్నారు.  తగు చర్య తీసుకుంటామని  భారత అసిస్టెంట్ హైకమిషనర్‌కు బంగ్లాదేశ్​ సీనియర్ అధికారులు హామీ ఇచ్చారు.

Bangladesh Unrest  : అసలు ఏం జరిగింది ?

బంగ్లాదేశ్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీన్ మరణంతో  ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే  దైవదూషణ ఆరోపణలతో  ఒక హిందువును ఒక గుంపు కొట్టి చంపారు.  గురువారం రాత్రి స్క్వేర్ మాస్టర్ బారిలోని దుబాలియా పారా ప్రాంతంలో ఈ అమానుష ఘటన  జరిగిందని  ఓ మీడియా  నివేదించింది. గురువారం ఉదయం బంగ్లాదేశ్​ ప్రశాంతంగా ఉంది.  ఇంక్విలాబ్ మంచా నాయకుడు హదీ మరణాన్ని ధృవీకరించారు. ఇక యువజనం రగిలిపోయారు.  గురువారం రాత్రి  దేశవ్యాప్తంగా  వివిధ ప్రాంతాల్లో దాడులు విధ్వంసాలు జరిగాయి.

Bangladesh Unrest

Bangladesh Unrest  : ఓ  హిందువు  ఖతం

భాలుకా ఉపజిల్లాలోని స్క్వేర్ మాస్టర్ బారిలోని దుబాలియా పారా ప్రాంతంలో  దీపు చంద్ర దాస్‌ ( Deepu Chandra Das) అనే వ్యక్తిని మూక కొట్టి చంపింది. భాలుకా పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ రిపోన్ మియా కథనం ప్రకారం,   “గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రవక్తను అవమానించారని ఆగ్రహించిన కొంతమంది వ్యక్తులు  ఓ వ్యక్తిని  పట్టుకుని కొట్టారు.

ఆ తర్వాత  మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పంటించారు.  పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని  మైమెన్సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మార్చురీకి పంపారు. ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు.  అతడి బంధువుల కోసం వెతుకుతున్నాం.  బంధువులు ఫిర్యాదు చేస్తే   చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని  రిపోన్ మియా చెప్పారు.

Bangladesh Unrest  : మూక హింసను ప్రతిఘటించండి

బంగ్లాదేశ్​ తాత్కలిక ప్రధాని యూనస్​

హాది మరణంపై స్పందిస్తూ, “హాదీ మరణం దేశ రాజకీయ ప్రజాస్వామ్య రంగానికి తీరని లోటు” అని బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్, అన్నారు. హాదీ  మరణంపై పారదర్శక దర్యాప్తు జరిపిస్తామన్నారు. బంగ్లాదేశ్‌లో అశాంతి చెలరేగుతున్న తరుణంలో, ముహమ్మద్ యూనస్ (Mahad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రజలను మూక హింసను  ప్రతిఘటించాలని కోరింది,

ఇటువంటి చర్యలు దేశ ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.  “మైమెన్‌సింగ్‌లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపడాన్ని మేము హృదయపూర్వకంగా (Condemned) ఖండిస్తున్నాం. కొత్త బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసకు చోటు లేదు. ఈ దారుణమైన నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం” అని ప్రకటనలో పేర్కొంది.  

Bangladesh Unrest

Bangladesh Unrest  : భారత పార్లమెంటరీ కమిటీ సమీక్ష బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై విదేశీ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమీక్షించింది. (Parlament Standing Committee)    మైనారిటీలు, మీడియా గ్రూపులు మేధావులపై దాడులు   కొనసాగుతున్నట్టు గుర్తించింది. “ఆగస్టు 2024 రాజకీయ సంఘటనలు గణనీయమైన అస్థిరత , అనిశ్చితిని సృష్టించాయి, మైనారిటీలు, గిరిజన సంఘాలు, మీడియా గ్రూపులు, మేధావులు, జర్నలిస్టులు, విద్యావేత్తలు మొదలైన  పై హింస, దాడులు బెదిరింపులు  పెరిగాయి, ” అని ప్యానెల్ పార్లమెంటులో సమర్పించిన నివేదికలో పేర్కొంది.

తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇటీవలి రాజకీయ పరిణామాల నుండి ద్వైపాక్షిక సంబంధాలను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, బంగ్లాదేశ్‌లో తీవ్రవాదం (Terrorism) మైనారిటీలపై దాడుల గురించి భారతదేశం ఆందోళన చెందుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కమిటీకి తెలిపింది.  

Bangladesh Unrest

ALSO READ : Yes Hyderabadi | ఔను .. హైదరాబాదీ

Leave a Reply