బాల్క సుమన్ హౌస్ అరెస్ట్..

బాల్క సుమన్ హౌస్ అరెస్ట్..
ఖ్యాతనపల్లి, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి నివాసంలో మందమర్రి సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుందని, పోలీసులతో నిర్బంధ రాజ్యం నడుపుతుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ధర్మం ఎప్పుడు విజయం సాధిస్తుందన్నారు. రాబోయే కాలంలో ప్రజలు రేవంత్ సర్కార్కు తగిన గుణపాఠం చెబుతారు అన్నారు.
