Bajrang Dal | వీహెచ్ పీ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో…

Bajrang Dal | వీహెచ్ పీ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో…

  • బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దహనం

Bajrang Dal | మక్తల్, ఆంధ్రప్రభ : విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్(Bajrang Dal) తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు బంగ్లాదేశ్ లో దీపు చంద్రపై జరిగిన సంఘటనను నిరసిస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వీహెచ్ పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

పట్టణం లోని స్వామి వివేకానంద చారస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ బాంగ్లాదేశ్(Bangladesh) దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ… హిందువులను అంతమొందించే జీహాదీ కుట్రలు ఇక సాగవన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ, ఇటీవల దీపు చంద్ర కిరాతక హత్యను ఖండించారు.

మతోన్మాద జీహాదీ గుండాలకు వ్యతిరేకంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ మైనారిటీలైన(minorities) హిందువులకు రక్షణ లేదంటూ పేర్కొన్నారు. భారతదేశంలో మైనారిటీలకు ఏ చిన్న సంఘటన జరిగినా మేమున్నామంటూ మాట్లాడే సెక్యులర్ వాదులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

వెస్టిన్ దేశాలు ఇస్లాం రాడికల్స్ తీవ్రవాదులు అక్కడున్న హిందూ మైనార్టీలపైన దాడులు చేసినా భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదులు(secularists) ఖండించడం లేదన్నారు. వారికి అనుకూలంగా నినాదాలు చేస్తూ సేవ్ గాజా అనే నినాదాలు చేస్తారని, అటువంటి వారు ఇతర దేశాలకు వెళ్లి ఉండొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఏబీవీపీ, బీకేయస్, బీజేపీ, అయ్యప్ప స్వాములు, పట్టణ ప్రజలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply