రాత్రి అడవిలో ఏం జరిగింది..?

రాత్రి అడవిలో ఏం జరిగింది..?

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిరుత ( leopard) దాడి చేసి ఆవును చంపిన సంఘటన మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుత్రమద్దిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు పుత్రమద్ది హరిజనవాడకు చెందిన భాస్కర్ తన పాడి ఆవును మంగళవారం గ్రామానికి సమీపంలో ఉన్న ఈచనేరి అడవిలోని మూలకుంట వద్ద మేయడానికి వదిలాడు. ఆవు రాత్రి ఇంటికి రాలేదు. ఉదయం వెళ్లి చూడగా ఆవు తీవ్రగాయాలతో మృతి చెందినట్టుగా కనిపించింది. చిరుత పులి ఆవు మీద దాడి చేసి చంపినట్లుగా భావిస్తున్నారు. చిరుత పులి తొలుత ఆవు మీద దాడి చేసి గొంతు కొరికి రక్తం తాగినట్లు చెబుతున్నారు.

తర్వాత ఆవు పొదుగు మొత్తం తిన్నట్లు చెబుతున్నారు. ఆవు(cow) లో కొంత భాగాన్ని తిని అక్కడే పడేసి వెళ్లిపోయింది. వెంటనే ఈ విషయాన్ని మండల అధికారులకు తెలియజేశారు. మూడు రోజుల కిందట తవణంపల్లి మండలం కొండరాజు కాల్వలో కూడా పులి కనిపించినట్టు సమాచారం. ఎస్టీ కాలనీకి చెందిన ఒక రైతు మేకను పులి చంపి అడవుల్లోకి తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మూడు రోజులకు కూడా గడవక ముందే కొండ్రరాజు కాల్వకు కొద్ది దూరంలో ఉన్న పుత్రమద్ది గ్రామంలో ఆవు చిరుతకి బలి అయ్యింది. గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో చిరుత పులి ఆవును చంపి తినడంతో అడవి వైపు వెళ్లడానికి గ్రామస్తులు భయపడుతున్నారు.

Leave a Reply