అవార్డుతో నా బాధ్యత పెరిగింది… కృష్ణ సమీరా

అవార్డుతో నా బాధ్యత పెరిగింది… కృష్ణ సమీరా

రాప్తాడు, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని కర్నూలు జిల్లాలోని అశోక సచి విశ్వవిద్యాలయం ఉత్తమ మహిళా సాధికారత కార్యక్రమంను నిర్వహించారు. ఉత్తమ మహిళా కరస్పాండెంట్లు విభాగంలో రాప్తాడు మండల పరిధిలోని గొల్లపల్లి దగ్గర ఉన్న మాంటిస్సోరి ఎలీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను అన్ని ప్రభుత్వ ప్రమాణాలు సక్రమంగా పాటిస్తూ నాణ్యమైన విద్యనందిస్తూ పాఠశాలను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మాంటిస్సోరి ఎలీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ కృష్ణసమీరా ను ఎంపిక చేశారు.

శనివారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవం వేడుకల్లో కృష్ణసమీరా కు మాంటిస్సోరి ఎలీట్ విద్యా ప్రణాళిక సాధికురాలు అవార్డును అందజేశారు. ఈ సంధర్భంగా కృష్ణ సమీరా మాట్లాడుతూ నా విజయం వెనుక నాకుటుంబం మా నాన్నమ్మ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. ఇది నా విజయం కాదు మాంటిస్సోరి కుటుంబ విజయం అని తెలిపారు.

ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి నాన్నమ్మ కళ్యాణి చిటికిన వేలు నడిచి కలానికి ప్రాణంపోసి తన ఆశయాలను ముందు తరాలకు అందించాలని దృఢ సంకల్పంతో ఎన్నో ఆశలతో ముందుకు నడుస్తున్నానని తెలిపారు. ఈ పురస్కారం నాకు మరింత బాధ్యతను పెంచిందన్నారు.

Leave a Reply