సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ

సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ
మోత్కూర్, ఆంధ్రప్రభ : జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ ఉగాది ఉత్సవాలు, కవి సమ్మేళనం,పురస్కారాల ప్రధానం సందర్భంగా మోత్కూర్ కి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ,కవయిత్రి, ప్రజాబారతి సంస్థ మాజీ ప్రధాన కార్యదర్శి మర్రి జయశ్రీ సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఆదివారం రాయగిరి లోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పోరెడ్డి రంగయ్య,బండి రాజుల శంకర్,మామిడాల చంద్రశేఖర్, సోమ సీతారాములు,బండారు జయశ్రీ,రామాంజనేయులు ల చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజాబారతి సంస్థ అధ్యక్షుడు బోల్ల హన్మంత్,ప్రతినిధులు టి ఉప్పలయ్య,ఇండ్ల రాంప్రసాద్, కాంబోజు మహేందర్, ధబ్బేటి సోంబాబు,జవ్వాజి మహేందర్ లు అభినందనలు తెలిపారు.
