అవిలిమల్లుకు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పదవి

అవిలిమల్లుకు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పదవి

  • టీపీసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా ఉత్తర్వుల స్వీకరణ

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అవిశెట్టి అవిలిమల్లును జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అవిలిమల్లు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి న్యాయం చేయడంతో పాటు జిల్లా లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply