అవనిగడ్డ ఎమ్మెల్యే కీలక నిర్ణయం..

అవనిగడ్డ ఎమ్మెల్యే కీలక నిర్ణయం..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : సోమవారం కోడూరు గ్రామంలో రూ.22 లక్షల యన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజల ఉపయోగార్దం రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే, కాంట్రాక్టరును బెదిరించి మిషన్ పంపించేసారు. మంత్రులు, నాయకులు తనను శంకుస్దాపన చేయమన్నారని చెప్పి మరో మిషన్ తీసుకువచ్చి ఎటువంటి అధికార పదవి లేని బండే శ్రీనివాసరావు అనే వ్యక్తి శంకుస్థాపన చేయడం శాసనసభ్యుని హక్కలను భంగపరచడం, అవమానించడంగా భావించి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నాను. శాసనసభ్యుని విధి నిర్వహణలో తలదూర్చకుండా, శాసనసభ్యుని మర్యాదలు ప్రివిలేజ్ కమిటి కాపాడుతుందని భావిస్తున్నానని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం తెలిపారు.
