Avanigadda | సకాలంలో ధాన్యం కొనుగోళ్లు

Avanigadda | సకాలంలో ధాన్యం కొనుగోళ్లు


పరిశీలించిన మండలి వెంకట్రామ్

Avanigadda | కోడూరు – ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ధాన్యం సకాలంలో కొనుగోలు జరిగేలా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అవనగడ్డ నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు. సోమవారం సాయంత్రం కోడూరు మండలం వీ.కొత్తపాలెంలో ధాన్యం కొనుగోళ్లను వెంకట్రామ్ పరిశీలించారు. ఎమ్మెల్యే (MLA) మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలతో అధికారులు వీ.కొత్తపాలెం గ్రామానికి లారీలు ఏర్పాటు చేసి ధాన్యం తరలింపులు వేగవంతం చేయటం పట్ల రైతులు ధన్యవాదములు తెలిపారు.

వెంకట్రామ్ (Venkatram) మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములు అయిన ప్రతి అధికారి, సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా పని చేసి రైతులకు మేలు చేసేలా ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వెంకట్రామ్ తెలిపారు. ప్రతి రైతు ధాన్యం సక్రమంగా కొనుగోలు జరిగేలా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

అనంతరం గ్రామ ప్రముఖులు రేపల్లె భాస్కరరావు (Repalle Bhaskara Rao) ఇటీవల ఆపరేషన్ చేయించుకోగా ఆయనను మండలి వెంకట్రామ్ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీఏఏ పవన్, టీసీ అధ్యక్షులు రేపల్లె రవీంద్ర, నాయకులు భూపతి అశోక్, యలవర్తి వినోద్, యలవర్తి పవన్ పాల్గొన్నారు.

Leave a Reply