AUTO | ఆటో ఢీ..

AUTO | ఆటో ఢీ..

AUTO | ఉట్నూర్, ఆంధ్రప్రభ : మండలంలోని షాంపూర్ వంతెన సమీపంలో ఆటో ఢీకొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని, వారు చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు. మండలంలోని నరసాపూర్ గ్రామానికి చెందిన ఆటోలో గోబీ కూరగాయలు తీసుకొని విక్రయించడానికి ఉట్నూర్ ఎక్స్ రోడ్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఇద్దరు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

Leave a Reply