AUS vs AFG | సెమీస్ కు ఆసీస్.. ఆఫ్ఘాన్ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన వరుణుడు !

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సెమీస్ పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఆఫ్ఘానిస్థాన్ ఆశలపై వరుణుడునీళ్లు జల్లాడు. ఈరోజు (శుక్ర‌వారం) లాహోర్ వేదికగా ఆస్ట్రేలియి – ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘాన్.. ఆసీస్ ముందు 274 ప‌రుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది. అయితే, ఛేజింగ్ కు దిగిన ఆసీస్ కు వ‌రుణుడు అడ్డు త‌గిలాడు. 12.5 ఓవ‌ర్ల వ‌ద్ద వ‌ర్షం కార‌ణంగా ఆట‌గాళ్లు గ్రౌండ్ ని వ‌దిలి వెళ్లారు. ట్రావిస్ హెడ్ 59, స్టీవ్ స్మిత్ 19 పరుగుల మీద ఉన్నారు. అయితే, ఎంతకీ వర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. దీంతో నాలుగ పాయింట్ల‌తో ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.

అఫ్గానిస్థాన్ జట్టు మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు సౌతాఫ్రికా జ‌ట్టుకు కూడా 3 పాయింట్లు ఉండ‌గా.. మెరుగైన రన్ రేట్ కారణంగా రెండో స్థానంలో ఉంది.

అయితే, గ్రూప్-బిలో ఉన్న ఇంగ్లండ్ ఇప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆఫ్ఘనిస్థాన్ కూడా దాదాపుగా నిష్క్రమించింది. అయితే రేపు దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు భారీ తేడాతో గెలిస్తే.. నెట్ రన్ రేట్ ఆధారంగా ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ చేరే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *