Attack | తల్లిని చంపిన కొడుకు

Attack | తల్లిని చంపిన కొడుకు
Attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిపై కొడుకు దాడి చేయడంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో తల్లిని కొడుకు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కడుదుల వెంకు (88) అనే వృద్ధురాలిపై ఆమె కొడుకు నంబయ్య రాత్రి దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
