Attack | హౌతీల‌పై ఇజ్రాయెల్ దాడులు – హైజాక్ ఓడ గెలాక్సీ లీడ‌ర్ పేల్చివేత

టెల్ అవిన్ – యెమెన్‌లోని (Yeman ) హౌతీ (houthi ) తిరుగుబాటుదారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel ) సోమవారం తెల్లవారుజామున భీకరదాడులు (attacks ) చేసింది. రెబల్స్ ఆధీనంలో ఉన్న ఓడరేవులు, వారి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీనిలో భాగంగా హౌతీలు హైజాక్ చేసిన గెలాక్సీ లీడ‌ర్ నౌక‌ను పేల్చివేసింది..

కాగా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఎర్ర సముద్రం కారిడార్‌లో 2023, నవంబర్‌లో వాహన రవాణా నౌక గెలాక్సీ లీడర్‌ను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో 25 మంది బందీలను కొన్నాళ్ల తర్వాత విడుదల చేశారు. ఈ నౌక ఇజ్రాయెల్‌కు చెందినదిగా రెబల్స్‌ అనుమానిస్తున్నారు. దీంతోపాటు ఇజ్రాయెల్‌కు చెందిన మొత్తం నౌకలను లక్ష్యంగా చేసుకొంటామని హూతీలు హెచ్చరించారు.

గెలాక్సీ లీడర్ నౌక హైజాక్‌ను ఇజ్రాయెల్‌, పశ్చిమదేశాలపై సాధించిన విజయంగా చెప్పుకోవడం మొదలుపెట్టింది. తుర్కియే నుంచి భారత్‌కు వెళుతుండగా.. దీనిని హైజాక్‌ చేశారు. ఈ నౌకను హూతీలు ఇతర ఓడలపై దాడులకు వాడటం మొదలుపెట్టారు. దీనిపై ఓ రాడార్‌ వ్యవస్థను బిగించారు. దాని సాయంతో ఎర్రసముద్రంపై నుంచి వెళుతున్న నౌకలను ట్రాక్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇజ్రాయెల్‌ ఈ నౌకను తాజా దాడుల్లో ధ్వంసం చేశాయి. దీంతోపాటు రేవులైన హుదైద్‌, సలీఫ్‌, రస్‌ ఇసాలోని లక్ష్యాలపై బాంబులు వేశాయి. వీటితోపాటు ఓ విద్యుత్తు కేంద్రాన్ని కూడా పేల్చేసింది.
ఈ ఓడరేవులను హౌతీ ఉగ్రవాదులు.. ఇరాన్ నుంచి ఆయుధాలను సరఫరా చేసుకోవడానికి ఉపయోగిస్తోంది. ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలపై ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు రైబల్స్ ఉపయోగిస్తున్నట్లుగా ఐడీఎఫ్ తెలిపింది.

Leave a Reply