Attack | చమురు ట్యాంక్ పేలుడు.. మంటలు

Attack | చమురు ట్యాంక్ పేలుడు.. మంటలు
Attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య మరో దాడి సంచలనం రేపింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు కువైట్‌లోని కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు కువైట్ విమానాశ్రయంలోని ఒక చమురు ట్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. ఈ దాడిలో ఇంధన ట్యాంకర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి.
ఘటన సమయంలో విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఆస్తి నష్టం పరిమితంగానే ఉండగా, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
