నందివాడ మండలంలో దారుణం..

నందివాడ మండలంలో దారుణం..
నందివాడ, ఆంధ్రప్రభ : నందివాడ మండలంలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న10 పదేళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. మండలంలోని పెదలింగాల గ్రామంలోనీ నానమ్మ ఇంట్లో నిద్రిస్తున్న బాలుడు గండికోట బాలాజీ, నానమ్మ లక్ష్మీ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో బాలాజీ మృతిచెందగా, తీవ్ర గాయాలైన వృద్ధురాలు లక్ష్మీ(70) పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు.
సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్న నందివాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాళ్లతో దాడి చేసినట్లు గుర్తించారు. వృద్ధురాలు స్థానికంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. దాడికి గల కారణాలను తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రశాంతంగా ఉండే పెదలింగాల గ్రామంలో హత్య ఘటన గ్రామస్తులను ఉలికిపాటుకు గురి చేసింది.
