భూపాలపల్లి జిల్లాలో దారుణం..

చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది.

గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కనుకుంట్ల లింగయ్య ఆయన భార్య ప్రమీల(50) ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో రోకలు బండతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం పరారైపోతున్న లింగయ్య పై పోలీసులకు గ్రామస్తులు సమాచార అందించారు.

ఘటన స్థలానికి ఎస్సై శ్రావణ్ కుమార్ వెళ్లి నిందితుడు లింగయ్యను అదుపులో తీసుకున్నారు. హత్యకు గురైన ఆమెకు ఇద్దరు కుమారులు సురేష్ , హరీష్ ఉన్నారు. కుమారుడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply