న్యాయవాదులు విధుల బహిష్కరణ

న్యాయవాదులు విధుల బహిష్కరణ

యువ న్యాయవాది హత్యకు దమ్మపేట బార్ అసోసియేషన్ ఖండన

దమ్మపేట, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువన్యాయవాది హత్య పట్ల దమ్మపేట బార్ అసోసియేషన్ బుధవారం హత్యను తీవ్రంగా ఖండించి ,విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొంది మురళీ మోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువ న్యాయవాది పూజారి ఎల్లయ్యను కొందరు వ్యక్తులు దారుణంగా హతమార్చిన ఘటన కలకలం రేపిందన్నారు .ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా మన్నారు.

ఈ ఘటనకు సంఘీభావంగా దమ్మపేట న్యాయవాదులు విధులు బహిష్కరించామన్నారు.ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లక్కినేని నరేంద్ర, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ , సీనియర్ న్యాయవాది అడమ్స్ , కాలం సంధ్యా రాణి, భవాని కృష్ణ, దర్గావళి, బాలరాజు, ఉదయ్, అప్పారావు, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply