ASSOCHAM India | అసోచామ్ ఇండియా వాటర్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ 2025

ASSOCHAM India | అసోచామ్ ఇండియా వాటర్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ 2025
- ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్‌కు ప్రత్యేక గుర్తింపు…
ASSOCHAM India | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి అల్ట్రాటెక్ ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ (ఏపీసీడబ్ల్యూ ), అసోచామ్ ఇండియా(ASSOCHAM India) వాటర్ లీడర్‌షిప్ కాన్ క్లేవ్ 2025లో గుర్తింపు పొందింది. ఈ అవార్డు భారత ప్రభుత్వ జల్ శక్తి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో న్యూఢిల్లీలో డిసెంబర్‌లో జరిగే కార్యక్రమంలో ఏపీసీడబ్ల్యూ పరిశ్రమల ద్వారా కమ్యూనిటీ వాటర్ ఇనిషియేటివ్స్ విభాగంలో అత్యుత్తమ సీఎస్ఆర్ కార్యక్రమాలను సత్కరించింది. ప్రాంతంలోని జిల్లాలు ప్రస్తుతం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.
ఇక్కడ వార్షికంగా కేవలం 450–500 మిమీ వర్షపాతం మాత్రమే లభిస్తుంది. వ్యవసాయం, సామాజిక స్థిరత్వంపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. అధిక నీటి వెలికితీత వల్ల భూగర్భ జలాలు ఏటా దాదాపు 30 సెం.మీ. తగ్గుతున్నాయి. వర్షాకాలం తర్వాత బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. దీనివల్ల నీటి కొరత తీవ్రమవుతోంది. గత ఐదేళ్లలో, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ (ఏపీసీడబ్ల్యూ ) అనేక సమగ్ర నీటి, వ్యవసాయ అండ్ సామాజిక పథకాలను విజయవంతంగా అమలు చేసింది.
వీటిలో నీటి సంరక్షణ నిర్మాణాల ఏర్పాటు, మట్టి ఆరోగ్య మ్యాపింగ్ అండ్ ఎరువుల సలహాలను అందించడం, ఆర్ఓ నీటి ప్లాంట్ల స్థాపన వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అదనంగా ఏపీసీడబ్ల్యూ(APCW) చిరుధాన్యాల ఆధారిత ఆహార శుద్ధి, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధి, మహిళలకు జీవనోపాధి శిక్షణ వంటి సామాజిక వ్యవహారాలపై కూడా దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ (ఏపీసీడబ్ల్యూ ) అమలు చేసిన సమగ్ర కార్యక్రమాలు ప్రాంతీయ నీటి లభ్యత, వ్యవసాయ ఉత్పాదకత, జీవనోపాధిలో సానుకూల మార్పులు తెచ్చాయి.
పెర్కోలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్ లు అండ్ మునిగిపోయిన చెరువుల ద్వారా దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల(cubic meters) నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడింది. వర్షపు నీటిని రీఛార్జ్ చేసే సామర్థ్యం సంవత్సరానికి 11 లక్షల క్యూబిక్ మీటర్లకు మించి తిరిగి ఉపయోగించబడుతుంది. ఫలితంగా, పంట దిగుబడులు 15–40 శాతం పెరిగాయని నమోదు చేయబడింది. పర్యవేక్షణ బావుల వద్ద భూగర్భజల మట్టాలు 2–4 మీటర్ల పెరుగుదలతో, రెండు జిల్లాల్లో దాదాపు 400 మంది రైతులు, 150 మంది మహిళలు, 415 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చింది.
రాజశ్రీ బిర్లా చైర్‌పర్సన్‌గా, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అల్ట్రాటెక్(Ultratech) సమగ్ర సామాజిక కార్యక్రమాలను చేపడుతోంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, స్థిరమైన జీవనోపాధి, సామాజిక మౌలిక సదుపాయాలు, సామాజిక కారణాలపై దృష్టి సారిస్తూ, కంపెనీ భారతదేశంలోని 16 రాష్ట్రాల్లోని 500కి పైగా గ్రామాల్లో 1.8 మిలియన్లకు పైగా లబ్ధిదారులకు తన మద్దతును అందిస్తోంది.
