ఢిల్లీ అసెంబ్లీలో నేడు రగడ చోటుచేసుకుంది. బీజేపీ ప్రభుత్వం శాసనసభలో గత ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ రిపోర్టు ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అంబేద్కర్, భగత్ సింగ్ చిత్ర పటాలు తొలగింపును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సభలో బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అతిషి సహా 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
కాగా, గత ఆప్ ప్రభుత్వం.. అవినీతికి పాల్పడిందని బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. మద్యం కుంభకోణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇక అంబేద్కర్ ఫొటో తొలగించి ప్రధాని మోడీ ఫొటో పెట్టడంపై అతిషి నిరసన వ్యక్తం చేశారు. తిరిగి అంబేద్కర్ ఫొటో పెట్టేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.
Assembly – ఢిల్లీ అసెంబ్లీలో రగడ …12 మంది అప్ ఎమ్మెల్యేలు సస్పెండ్
