Assembly | సీఎం కావాలనుంది..

Assembly | సీఎం కావాలనుంది..

Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో తనకున్న సంబంధం గురించి, సినిమాల్లో తన నటనాభిలాష గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ… మల్లారెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్‌రెడ్డి మినహా మరో పవర్‌ఫుల్ నాయకుడు లేరని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. గతంలో జరిగిన రెడ్డి సంఘం సమావేశంలో రేవంత్ ఒక్కరే గట్టి నాయకుడని తాను నొక్కి చెప్పినట్లు ప్రస్తావించారు.

రాజకీయాలు ఎలా ఉన్నా.. ఎవరు అవునన్నా, కాదన్నా తాను, రేవంత్‌రెడ్డి అన్నదమ్ములమే అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. సినిమాలపై తనకున్న మక్కువను మల్లారెడ్డి మరోసారి బయటపెట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ హీరోగా నటించి, ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీశ్‌శంకర్ తనను అడిగారని పేర్కొన్నారు. అయితే, ఆ విలన్ పాత్రకు తాను నో చెప్పానని ఆయన తెలిపారు. రియల్ లైఫ్‌లో కాకపోయినా, రీల్ లైఫ్ లోనైనా ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ మల్లారెడ్డి తన మనసులో మాటను చెప్పారు. సినిమాల్లో తనకు ముఖ్యమంత్రి పాత్ర చేయాలని బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply