అశోక్ గజపతిరాజు శంకుస్థాపన
విజయనగరం, అక్టోబర్ 9(ఆంధ్ర ప్రభ): శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రూ. 1 కోటి 80 లక్షల వ్యయంతో ఆలయ విస్తరణ పనులు (Temple expansion works) చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఏడాదిలోపల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి ద్వారా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఆలయ ఈవో శిరీష తదితరులు పాల్గొన్నారు. ఆలయ విస్తరణతో యాత్రికులకు సౌకర్యాలు మరింత మెరుగవుతాయని అధికారులు తెలిపారు.