asha bhosle| ఎన్నో అవార్డులు ఆమె సొంతం..

asha bhosle| ఎన్నో అవార్డులు ఆమె సొంతం..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : గాన‌కోకిల‌, ఫేమ‌స్ సింగ‌ర్ ఆశా భోస్లే(92) ఇవాళ కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో నిన్న ముంబయి బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1993లో మహారాష్ట్రలో జన్మించిన ఆమె సింగ‌ర్‌గా ఎన్నో ఘ‌న‌త‌లు సొంతం చేసుకుంది. ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2008లో పద్మవిభూషణ్ అంద‌జేసింది. ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్న ఆశా భోస్లే రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు అందుకున్నారు. 1981లో ‘ఉమ్రావ్ జాన్’ చిత్రంలోని ‘దిల్ చీజ్ క్యా హై’ పాటకు జాతీయ అవార్డు, 1987లో ‘ఇజాజత్’ చిత్రంలోని ‘మేరా కుచ్ సామాన్’ పాటకు జాతీయ పురస్కారం అందుకున్నారు. 1989లో ఆమెకు ‘నైటింగేల్ ఆఫ్ ఆసియా’ పురస్కారం వరించింది. 2000లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుతో కేంద్రం సత్కరించింది. 2001లో ఆశా భోస్లేకు ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. 2002లో ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారం,1972లో ‘కారవాన్’, 1996లో ‘రంగీలా’ వంటి చిత్రాలకు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు, 1973లో ‘హరే రామ హరే కృష్ణ’ చిత్రానికి ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు అందుకున్నారు.

రేపు అంత్య‌క్రియ‌లు
రేపు సా.4 గం.కు ముంబయిలోని శివాజీ పార్కులో ఆశా భోస్లే అంత్యక్రియలు జరగనున్నాయి. రేపు ఉ.11 నుంచి అభిమానుల సందర్శనార్థం స్వగృహంలో ఆశా భోస్లే భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ముంబయిలోని శివాజీ పార్కులో ఆశా భోస్లే అంత్యక్రియలు జరగనున్నాయి.

Leave a Reply