Arrest|భీమిలి సమీపంలో జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్టు

విశాఖ : రాజధాని మహిళలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును (Krishnam Raju) తుళ్ళూరు (Tulluru) పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతన్ని బుధవారం రాత్రి భీమిలి (Bhimili) గోస్తనీనది సమీపంలో సెల్‌ టవర్‌ లోకేషన్‌ (cell tower location) ఆధారంగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృష్ణంరాజు వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురినీ విశాఖ నుంచి విజయవాడ తీసుకొస్తున్నట్టు సమాచారం.

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌ వీవీఆర్‌ కృష్ణంరాజు, టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేయగా.. మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

Leave a Reply