Armoor | చైనా మాంజా అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్‌….

Armoor | చైనా మాంజా అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్‌….

Armoor | అర్మూర్, ఆంధ్రప్రభ : ఆర్మూర్ పట్టణంలో నిషేధిత చైనీస్ మాంజా అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత చైనీస్ మాంజా అమ్ముతున్న షాపు యజమాని నారాయణ, రవిలను అర్మూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 18,050 రూపాయల విలువగల చైనీస్ మాంజాను స్వాధీనపర్చుకున్నారు. షాపు యజమాని, నిజామాబాద్ లో నిషేధిత చైనీస్ మాంజా హోల్సేల్ గా అమ్ముతున్న జహీర్ ఖాన్ లపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్ఎచ్ఓ పి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Leave a Reply