బీజేవైఎం జిల్లా కార్యదర్శి నియామకం

బీజేవైఎం జిల్లా కార్యదర్శి నియామకం

జన్నారం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా బీజేవైఎం(BJYM) కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్‌కు చెందిన ముడుగు ప్రవీణ్ కుమార్‌(Mudugu Praveen Kumar)ను జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ నియమించారు. ఈ మేరకు నియామక లేఖను అతనికి ఈ రోజు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. తనను బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు మరింత కష్టపడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పార్టీలోని అందరితో కలిసి మెలిసి ఉంటూ పార్టీ కార్యకర్తలను, నాయకులను కలుపుకొని రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Leave a Reply