Applications | ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

Applications | ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
- ఐటీడీఏ పివో యువరాజ్ మార్మాట్
Applications | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ పివో యువరాజ్ మార్మాట్ అన్నారు. సోమవారం కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచిఅర్జీలుస్వీకరించారు.
ఉట్నూర్ మండలం శ్యాంపూర్ గ్రామానికి చెందిన దుర్గం ధర్మయ్య తనకి పట్టా మంజూరు కల్పించామని, ఇంద్రవెల్లి మండలం మార్కగూడ గ్రామానికి చెందిన దేవరావు వ్యవసాయం లో బోర్వెల్ అందించాలనికోరారు.నార్నూర్ మండలం నార్నూర్ గ్రామానికి చెందిన సరిత తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కొరకు అర్జీ, ఉట్నూర్ మండలం రామగూడ గ్రామానికి చెందిన మారుతీరావు వికలాంగుల పింఛన్ మంజూరు చేయించాలని అర్జీ కోరారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధిం చిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అం దజేశారు. ఈ కార్యక్రమంలో ఐ టి డి ఏ ఏవో దామోదర స్వామి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ జాదవ్, ఐటీడీఏఈఈ తానాజీ జాదవ్, సంబంధిత అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు.
