ఎమ్మెల్యే సామెల్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్యే సామెల్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

మోత్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారుడు, దళిత ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై బీజేపీ గూండాలు చేసిన దాడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పూర్తి బాధ్యత వహించి, దళిత సమాజానికి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు గౌడ్,జిల్లా కాంగ్రెస్ నాయకులు డా గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి లు అన్నారు.

గాంధీ భవన్ లో మందుల సామేల్ సభలో బ్రాహ్మణుల మీద తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడం జరిగిందని, వ్యాఖ్యలకు విచారణ తెలిపి హుందాతనం ప్రదర్శించిన ఎమ్మెల్యే ఇంటి మీద బిజెపి నాయకులు దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు.దళిత సమాజాన్ని చూస్తే బిజెపి ఓర్వదని మరొకసారి నిరూపితమైందని బండి సంజయ్ యావత్ దళిత సమాజానికి క్షమాపణ చెప్పి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కాంగ్రెస్ నాయకులు బద్ధం నాగార్జున రెడ్డి, గడ్డం సోమనర్సయ్య,కారుపోతుల శ్రీను,బందెల రవి,బండారు వెంకట్ రెడ్డి, బొల్లెపల్లి శ్రావణ్, సురిగల దశరథ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply