ఆట్టహాసంగా నూతన బ్రిడ్జి ప్రారంభోత్సవం..

ఆట్టహాసంగా నూతన బ్రిడ్జి ప్రారంభోత్సవం..

రాప్తాడు, ఆంధ్రప్రభ : అన్ని సమస్యలను అధిగమించి ఎట్టకేలకు రాప్తాడు ఫోర్ లైన్ బ్రిడ్జిని నిర్మించి ప్రజలకు వాహనదారులకు అందించామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.ఆదివారం రాప్తాడు మండల కేంద్రంలోని ఫోర్ లైన్ రైల్వే బ్రిడ్జిని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ మరియు మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరంఎమ్మెల్యే సునీత ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన బ్రిడ్జిని ప్రారంభించారు.ఒక పండుగ వాతావరణంలో బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది.ఎమ్మెల్యే సునీత స్వయంగా బ్రిడ్జిపై ప్రదర్శనగా వెళ్లారు.ఈ సంధర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ టిడిపి హయాంలో రాప్తాడు ఫోర్ లైన్ రైల్వే బ్రిడ్జిని కేవలం 8 నెలలలోపే పూర్తి చేశామని తెలిపారు.

కూటమి ప్రభుత్వంలో 2017లో రూ.74 కోట్లతో బ్రిడ్జి మంజూరు అయ్యింది. 1.8కిలోమీటర్ల మేర 42 మరియు 44వ జాతీయ రహదారులను కలపడంతో పాటు బెంగళూరు హిందూపురం, పెనుగొండ మడకశిర పావగడ రాప్తాడు నియోజకవర్గాల ప్రజలు అనంతపురం పట్టణంలోకి రావడానికి మరియు బళ్లారి గుత్తి రాప్తాడు వైపు నుండి వచ్చే వాహనాలు తిరుపతి చెన్నై వెళ్లడానికి ఈ బ్రిడ్జి ఉపయోగపడేలా ప్లాన్ చేశారన్నారు.రైలు వచ్చే సమయంలో గేటు వేసినప్పుడు వాహనదారులు ఎక్కువసేపు నిరీక్షించే పరిస్థితి ఉండేదన్నారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం వచ్చేవాళ్ళు మరియు విద్యార్థులు ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. బ్రిడ్జి పనులు 2017లో ప్రారంభించగా రూ.55కోట్లు నిధులతో తమిళనాడుకు చెందిన ఒక కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు.

అయితే 70శాతం పనులు పూర్తి అయ్యాక 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వంలో ఈ పనులు ఆగిపోయాయి.ఆ కాంట్రాక్టర్ మిగిలిన పనులను పూర్తి చేయనందున పనులను రద్దు చేశారన్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి రూ.25 కోట్లు నిధులు తీసుకొచ్చాము. ఎస్.కె.సీ కాంట్రాక్టర్లు కేవలం 8 నెలల్లో పై బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు.ప్రస్తుతం ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల బెంగళూరు-చెన్నై- హైదరాబాద్ మూడు రహదారులు కలుస్తున్నాయి.ఈ మార్గంలో ప్రయాణించే వాళ్ళకు ఇక కష్టాలు ఉండవన్నారు.దాదాపు ఈ బ్రిడ్జి వలన ఏళ్లపాటు నాతో సహా ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ బ్రిడ్జి అనుకున్న సమయానికన్నా ముందే పూర్తిచేసిన కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే సునీత కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.

రోడ్డు బాగా ఉందని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనిశబ్రిడ్జిపై అతివేగంగా వెళ్లవద్దని ప్రయాణికులకు, వాహనదారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు ఎల్. నారాయణ చౌదరి ఏడీసీసీ చైర్మన్ నెట్టెం వెంకటేష్ రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు మరూరు పిఎసిఎస్ చైర్మన్ గోపాల్ నాయుడు మండల కన్వీనర్ పంపు కొండప్ప ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు డాక్టర్ సర్పంచ్ సాకే తిరుపాల్ టిడిపి నాయకుడు ఉప్పర శ్రీనివాసులు క్లస్టర్ ఇంచార్జిలు రాము సోమర నారాయణస్వామి కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply