AP | టెక్నాలజీ సాయంతో అభివృద్ధి పదంలోకి సాగుదాం : చంద్రబాబు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి, సీఎం చంద్రబాబు l కి ఉగాది పచ్చడిని అందజేశారు. పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేసారు

అనంతరం సీఎం మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని సీఎం అన్నారు.

ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది అని పేర్కొన్నారు. ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్ నడుస్తుంది.. వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ పాలన తెచ్చాం.. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్.. ఏఐతో అన్ని సుసాధ్యాలే అని ఆయన చెప్పారు.

గత ఐదేళ్లలో అందరికీ అవమానాలే జరిగాయని ఆరోపించారు. మన సమస్యలకు ఏఐ సులభంగా పరిష్కారం చూపిస్తుంది.. సంపద కొందరికే పరిమితం కాకూడదు.. సంపద ప్రతి ఒక్కరికీ అందాలి.. అప్పుడు నిజమైన సమ సమాజం సాధ్యం అవుతుందన్నారు. దీన్ని ఓ పాలసీగా తీసుకొస్తున్నాం.. ఇక నుంచి ఎవరూ పేదలుగా ఉండకూడదు అని సూచించారు. అందరికీ మంచి విద్య, వైద్యం అందాలి.. ఇది నా జీవితాశయం.. మార్గదర్శి, బంగారు కుటుంబం, పీ4 కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు.

’20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను. నా మాట విని ఆ రంగం వైపు వెళ్లినవారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అవకాశాలు ఉపయోగించుకుంటే సాధారణ వ్యక్తులూ ఉన్నతంగా ఎదుగుతారు. అధికంగా డబ్బు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారు. అలాంటి వారు తిరిగి సమాజానికి ఇవ్వాలి. పేదరిక రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలి. జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం అవుతుంది. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే పీ-4 విధానం తీసుకొస్తున్నాం” అని చంద్రబాబు అన్నారు.

అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలను సీఎం ప్రదానం చేశారు.

Leave a Reply