AP | తుని వైసిపిలో ముస‌లం – చైర్ ప‌ర్స‌న్ పదవికి సుధారాణి రాజీనామా

తుని వైసీపీలో ములసం మొదలైంది. ఏం జరిగిందో తెలీదుగానీ, చైర్ ప‌ర్స‌న్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు సుధారాణి. సోమవారం ఉదయం మీడియా ముందుకొచ్చిన ఆమె, చైర్ ప‌ర్స‌న్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, కౌన్సిలర్‌గా కొనసాగుతానని ప్రకటన చేశారు. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తుని మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ పదవి కన్నేసింది టీడీపీ. మొత్తం 28 మంది సభ్యులు 15 మంది మద్దతు పొందితే వైస్ ఛైర్మన్ పదవి దక్కడం ఖాయం. ఈ క్రమంలో దాదాపు 10 మంది కౌన్సెలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు వెళ్లారు. ఎక్స్ ఆఫీషియో టీడీపీ ఎమ్మెల్యే కావడంతో మరో నలుగురు కౌన్సెలర్లు మద్దుతు టీడీపీకి అవసరమైంది. ఈ క్రమంలో అసలు రాజకీయాలు మొదలయ్యాయి.వైస్ ఛైర్మన్ పదవి నుంచేనాలుగు సార్లు వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ-వైసీపీ కౌన్సెలర్ల మధ్య క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగాయి. చివరకు వైసీపీకి చెందిన కౌన్సెలర్లను మాజీ మంత్రి దాడి‌శెట్టి రాజా, ఛైర్మన్ ఇంట్లో బంధించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ కార్యకర్తలు అక్కడికి రావడంతో పెద్ద రచ్చ అయ్యింది. ఈ క్రమంలో దాడిశెట్టి రాజాపై దాడి చేసే ప్రయత్నం చేశారు టీడీపీ కార్యకర్తలు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దారు. ఇదే క్రమంలో సమావేశానికి కావాల్సిన కోరం లేకపోవడంతో వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు అధికారులు. ఈ వ్యవహారం జరిగి దాదాపు నాలుగైదు రోజులు అయ్యింది. మరి ఏం జరిగిందో తెలీదు ఒక్కసారిగా సోమవారం మీడియా ముందుకొచ్చారు ఛైర్మన్ సుధారాణి.

గతరాత్రి ఏం జరిగింది?

రాజీనామాకు ముందు ఆదివారం రాత్రి చైర్ ప‌ర్స‌న్ సుధారాణి ఇంట్లో వైసీపీ కౌన్సెలర్లతో సమావేశం జరిగింది. దీనికి ఆ పార్టీకి చెందిన 14 మంది కౌన్సెలర్లు మాత్రమే హాజరయ్యారు. మరో నలుగురు టీడీపీ వైపు వెళ్లినట్టు అంతర్గత సమాచారం. ఇరు పార్టీల బలబలాలు సమానమయ్యాయి. పరిస్థితి గమనించిన సుధారాణి ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమకు 17 మంది కౌన్సెలర్లు మద్దతు ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారామె. తనను కౌన్సిలర్ గా గెలిపించిన ప్రజల కోసం, పార్టీ కోసం పోరాడుతానని చెప్పారు. తనతోపాటు మిగతా కౌన్సిలర్లను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. తన రాజీనామా లేఖను కమిషనర్‌కు అందజేశారు సుధారాణి. కావాల్సిన బలం ఉంటే సుధారాణి ఎందుకు రాజీనామా చేశారన్నది అసలు ప్రశ్న ప‌ద‌వికి ఆమె రాజీనామా చేయడంతో తునిలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పదవులపై టీడీపీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ లెక్కన రేపో మాపో మున్సిపల్ సమావేశం జరగనుంది. మరి సభ్యులు ఈసారి ఛైర్మన్ గా ఎవర్ని ఎన్నుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *