AP – రాత్రి 7 గంటలకు సంచలన విషయం వెల్లడిస్తాం – వైసిపి ట్విట్
వెలగపూడి – మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ఇవాళ రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం. అతిపెద్ద రహస్యం బయటపడనుంది అని ట్వీట్ లో పేర్కొంది. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదురారైన సత్వవర్ధన్ ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలులో ఆయనతో ములాఖత్ అయ్యారు. ఈ అరెస్ట్ ను జగన్ ఖండించారు.. దీనిపై వాస్తవాలని నేటి రాత్రి వెల్లడిస్తామని వైసిపి తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది..