AP | వల్లభనేని వంశీకి సుప్రీం షాక్ .. ముందస్తు బెయిల్ రద్దు

హైదరాబాద్ – అక్రమ మైనింగ్ కేసులో (Mining case ) వైసిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (vallabhaneni Vamsi ) సుప్రీంకోర్టులో (supreme court ) చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ (pre bail) మంజారు చేస్తూ రాష్ట్ర హైకోర్టు (ap highcourt ) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసు మెరిట్స్లోకి, పీటీ వారెంట్లోకి వెళ్లడంలేదని పేర్కొంది.

Leave a Reply