AP | విజయసాయి రెడ్డికి మ‌రోసారి సిట్ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. ఇందులో భాగంగా, మాజీ ఎంపీ వి.విజయసాయి రెడ్డికి మ‌రోసారి నోటీసులు జారీ అయ్యాయి. జూలై 12న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని అధికారులు విజయసాయి రెడ్డిని ఆదేశించారు. ఏప్రిల్‌లో ఒకసారి ఆయన సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో, మద్యం పాలసీని మార్చారని, కొన్ని బ్రాండ్‌లకు అనుకూలంగా వ్యవహరించారని, భారీగా ముడుపులు అందుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల, సిట్ పురుషోత్తం వరుణ్ కుమార్‌ను 40వ నిందితుడిగా చేర్చింది.

ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న వరుణ్ కుమార్ ప్రస్తుతం అమెరికాలో ఉండ‌గా, అతని కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా మనీలాండరింగ్ కోసం PMLA కింద కేసు నమోదు చేసింది. హవాలా లావాదేవీలు, అక్రమ నగదు బదిలీలను ఛేదించే ప్రయత్నంలో ఉంది.

Leave a Reply