AP | జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణమురళి…

గుంటూరు – నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్‌పై గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గత నెల 26న పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు. ఆయనకు శుక్రవారమే బెయిల్ లభించింది. అయితే బెయిల్ పత్రాలు సమర్పించడం ఆలస్యం అవ్వడంతో నేడు విడుదలయ్యారు..

ఇక.. ఫిబ్రవరి 26న ఏపీలోని ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్‌ కేసుకు సంబంధించి అరెస్టు చేసిన పోలీసులు.. రాజంపేట కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించారు. ఆ తర్వాత.. ఏపీలోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలోనూ 16 కేసులు నమోదు కావడంతో పిటి వారెంట్‌పై ఆయా కోర్టుల్లో హాజరుపరిచారు పోలీసులు. ఈ క్రమంలో.. రాజంపేట, నరసరావుపేట కేసులతోపాటు ఇటీవల నమోదైన కేసుల్లోనూ బెయిల్‌ వచ్చినా.. కొద్దిరోజుల క్రితం సిఐడి పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో పోసాని విడుదలకు బ్రేక్‌ పడింది. అయితే శుక్రవారం అన్ని కేసుల్లోనూ పోసాని కృష్ణమురళీకి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గుంటూరు జైలు నుంచి రిలీజ్‌ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *