AP | ఆరోగ్య రంగ అభివృద్ధికి నూతన దిశ…

  • కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వర్ణ ఆంధ్ర విజన్‌ను ముందుకు తీసుకెళ్తున్నామని టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

ఆరోగ్య రంగాన్ని ఆధునికీకరించేందుకు కూట‌మి ప్రభుత్వం తీసుకున్న వినూత్న చర్యల భాగంగా, రాష్ట్రంలో తొలిసారిగా కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ (DiNC) ను ప్రారంభించారు. టాటా గ్రూప్ తో భాగస్వామ్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs) డిజిటల్ విధానంలో అనుసంధానమయ్యాయి.

ఈ నూత‌న‌ కేంద్రం డిజిటల్ మెడికల్ రికార్డులు, వర్చువల్ కన్సల్టేషన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వైద్య సేవలను అందిస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లడానికి మార్గం చూపుతుందని ఆయన అన్నారు.

ప్రజల అవసరాల కేంద్రంగా ఉండే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల రోగులకు తక్షణ సమాచారం, వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలు లాంటి సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని అన్నారు. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక ఉందని చెప్పారు.

ఇది కేవలం డబ్బు కోసమే కాదని… ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య రంగాన్ని కొత్త దిశలో తిరుగులేని మార్గంలో తీసుకెళ్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Leave a Reply