తాడేపల్లి : స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రేపు తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా (కర్నూలు, నంద్యాల జిల్లాలు) నాయకులతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశానికి మేయర్, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ ఛైర్మన్‌లు, మండల ప్రెసిడెంట్‌లను ఆహ్వనించారు.
వీరితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు,పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు.