వెలగపూడి – ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖలో తనపై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేయగా 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని కిందటి ఏడాది నవంబర్‌లో విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. దీనిపై నానీ కోర్టు ను ఆశ్రయించగా నేడు కోర్టు తీర్పు ఇచ్చింది.
AP | కొడాలి నానికి హైకోర్టులో ఊరట ..
