AP CM | ముద్రగడ లేఖ…

AP CM | ముద్రగడ లేఖ

AP CM | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. వైసీపీ నేతలను అవమానించడం సరికాదని, కాపులను ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో హామీ ఇచ్చి మోసం చేశారని, కాపు సామాజికవర్గం కోపంగా ఉన్నప్పటికీ పవన్‌కల్యాణ్‌పై ప్రేమతోనే మద్దతు ఇచ్చారని ముద్రగడ పేర్కొన్నారు.

మాజీ మంత్రులు రజనీ, అంబటి రాంబాబు, జోగి రమేశ్ లను అవమానించేలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పాలన ఉందా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇవ్వడం నుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటివి చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక్క అబద్ధాన్ని కప్పి పుచ్చడానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుందని తన తండ్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. టీడీపీ నేతలు ఆడిన ఒక్క అబద్ధం వల్ల పార్టీ ఎంత నష్టపోయిందో పరిశీలించుకోవాలని సూచించారు. రాక్షస పాలనలో దహనకాండ జరుగుతోందని, ఏపీలో మోడీ అత్యవసర పరిస్థితి విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply