అమరావతి – గ్లోబల్ వార్మింగ్ (Global Warming ) నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ (green Hydrogen ) ప్రాధాన్యత పెరిగిందని , దీనిపై పరిశోధనలు (Inventions ) చేయాలని విద్యుత్ తయారీ సంస్థలకు పిలుపు ఇచ్చారు ఎపి సిఎం చంద్రబాబు (ap CM chandrababu ) .. అమరావతి ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో నేడు జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో వివిధ కంపెనీల సీఈవోలతో (CEO ) సీఎం చం సమావేశం అయ్యారు. ఈ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్‌తో విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాల గురించి వారితో చర్చించారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, సీఎస్ విజయానంద్, ఇంధన రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీని హైడ్రోజన్ వ్యాలీగా మారాలని నిర్ణయించామని.. అందుకు అవసరమైన టెక్నాలజీ మీరు తీసుకురావాలని హాజరైన వివిధ సంస్థల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. దేశంలో విద్యుత్ సంస్కరణలని తొలిసారి ప్రారంభించానని చెప్పారు. దాని ఫలితంగా తాను అధికారం కోల్పోయానని గుర్తు చేశారు.. అయినా తాను ఎన్నడూ సంస్కరణలను ఆపలేదన్నారు చంద్రబాబు ..
తాను మీ ఆలోచనలు వినటానికి, ఆవిష్కరణల గురించి తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చానని చెప్పారు . . ఎనర్జీ తయారీ ఖర్చును ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నామని అంటూ . రెండు రోజులు పాటు మీరు ఇక్కడ ఉంటారు. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజ్‌పై దృష్టి సారించాలని కోరారు. గ్లోబల్ వార్నింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందని అంటూ దీనిపై . విద్యుత్ తయారీ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలని అభిలషించారు. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
500 గిగావాట్ల హరిత విద్యుత్ తయారీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా నిర్దేశించారని పేర్కొన్నారు. నీతి అయోగ్ కూడా దీనిపై దృష్టి సారించిందన్నారు. మీ అందరికీ బెస్ట్ ప్లేస్ ఏపీలోనే ఉందని అంటూ కాబట్టి మీరు అందరూ ఎపిలో పెట్టుబడులు , పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలి’ అని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.