అభివృద్ధిపై చర్చకు సిద్దమా అంటూ బొత్స సవాల్
ఏం చేశారని చర్చకు రావాలంటూ అచ్నన్న కౌంటర్
మీ అయిదేళ్లలో ఒక్క ఇళ్లు కట్టారా అంటూ నిలదీత
మార్కెట్ యార్డ్ లను బ్రష్టు పట్టించారు…
వెలగపూడి , ఆంధ్రప్రభ – శాసనమండలిలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి, శాసనమండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణ బొత్సా సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నాశనం చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తీసుకువచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. గాలి వచ్చినా గాలి లేకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్సా సత్యనారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అయ్యావు… మంత్రి అయ్యావు… ఇంకా ఏమి లేదు అవ్వడానికి అని అచ్చెన్నాయుడుని ఉద్దేశించి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
2014 – 19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి తాను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. కేంద్రం డబ్బులతోనే కథ నడిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. తాము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు. వైసీపీ హయాంలో ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
మిర్చి రైతులపై వైసీపీ సభ్యులు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై ఇవాళ(సోమవారం) చర్చ ప్రారంభమైంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధుల అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చర్చించారు. వైసీపీ హయాంలో గుంటూరు మిర్చి యార్డు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు మిర్చి యార్డులో జరిగిన అవినీతిపై విచారణ చేశామని అన్నారు.మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు, తాను సమీక్ష చేశానని అన్నారు. మిర్చి రైతులకు లాభం రావాలని 5 గంటలసేపు సీఎం చర్చించారు. మిర్చి ధరలపై ఎగుమతిదారులు, మిర్చి రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారని అన్నారు. మిర్చి రైతులకు లాభం రావాలని కేంద్ర వ్యవసాయమంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారని గుర్తుచేశారు. మార్కెట్లో మిర్చికి రూ.11,500 ఉంటే రూ.7,500కే కొనాలని వైసీపీ జీవో ఇచ్చిందని తెలిపారు.
బిల్లులు ఇవ్వలేదనడం అవాస్తవం: బొత్స సత్యనారాయణ
2014 – 19 ఇళ్లు కట్టిన వారికి వైసీపీ ప్రభుత్వ హయంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవమని శాసనమండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చామని గుర్తుచేశారు. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదని చెప్పారు. కూటమి నేతలు కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రాజకీయ కక్ష్యలతో ఇవ్వలేదని చెప్పటం సరికాదన్నారు.వైసీపీ ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చిందని తెలిపారు. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని అప్పటి మా ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. తమ ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చామని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. మిర్చి రైతుల సమస్యలపై కౌన్సిల్లో వాయిదా తీర్మానాన్ని వైసీపీ ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. వెల్లోకి వెళ్లి వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.