కోసిగి, మార్చి23 ,(ఆంధ్రప్రభ) మిద్దెపై నుండి పడి బాలిక మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా, కోసిగి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.వందగల్లు గ్రామానికి చెందిన నాగలక్ష్మి ,అంజినెయుల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇందులో పెద్ద కుమార్తె శ్రీదేవి(3) ఆదివారం నాడు మిద్దె ఎక్కి పై నుండి ప్రమాదశాత్తు కిందపడి మృతి చెందిదని తల్లిదండ్రులు తెలిపారు.
తల్లిదండ్రులు ఇంట్లో ఉండగానే ఇంటి పక్కనే గల రోడ్డుపై వెళుతున్న వాహనాలు చూసేందుకు మిద్దెపై కి ఎక్కి ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి .వెంటనే తల్లిదండ్రులు తేరుకొని గాయాలైన శ్రీదేవిని వెనువెంటనే కోసిగి ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించి న వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.