AP Assembly: ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: ఈనెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. 15 పనిదినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.