AP | 18 నుంచి అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్ !

  • క్రికెట్ లీగ్ కప్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

విజయవాడ: వార్తా సేకరణలో నిరంతరం బిజీగా ఉండే జర్నలిస్టులకు ఆటవిడుపుగా క్రికెట్ టోర్నీని నిర్వహించుకోవడం అభినందనీయమని, సుహృద్భావ వాతావరణంలో పోటీపడి క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో జరగనున్న అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్ విన్నర్స్ కప్ ను ఆయన బుధవారం ఆవిష్కరించారు.

భవానీపురం బెరం పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్స్ క్రికెట్ కప్ నిర్వాహకులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. టోర్నీ వివరాలను అడిగి తెలుసుకుని, క్రీడలను ప్రోత్సహించేలా వార్తలందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని, మొత్తం 10 జట్లు టోర్నీలో పాల్గొంటాయని నిర్వాహకులు వివరించారు. కేశినేని ఫౌండేషన్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, శాప్ సహకారం అందించగా… కేఎల్ యూనివర్సిటీ ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. మూడు రోజులు పాటు జరిగే పోటీలకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే నిర్వాహకులు పూర్తి చేశారు.

Leave a Reply