Ap | ఓటు మన జన్మ హక్కు…

Ap | ఓటు మన జన్మ హక్కు…
Ap | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : 16వ అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వివిధ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు స్థానిక ఏడు రోడ్ల కూడలి నుండి బాపూజీ కళామందిర్ వరకు ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాపూజీ కళామందిర్ వేదికగా 16వ అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, దేశభక్తి గీతాన్ని పాడి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుని అమూల్యమైన హక్కుఅని, ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచి, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని, ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి కోరారు.
ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయాల్లో ఓటింగ్ శాతం పెరగాలంటే ముఖ్యంగా యువత తమ హక్కుగా భావించి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, దీనివలన మంచి నాయకులను ఎన్నుకునే సామర్థ్యం మీకు వస్తుందని తప్పకుండా ఓటర్లుగా చేరాలని, ఓటర్ ఐడి కార్డు మీ యొక్క ఉనికిని తెలియజేస్తుందని భారత పౌరునిగా ఇది మీ యొక్క బాధ్యతని గుర్తుచేశారు. అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటర్లుగా చేరడం తమ ప్రధాన బాధ్యతని, భారతదేశం ప్రజాస్వాదేశమని ఈ దేశంలో పుట్టినందుకు బాధ్యతాయుతంగా 18 సంవత్సరములు వయసు నిండిన యువతీ, యువకులకు అందరికీ ఓటు హక్కు ఉండాలని అలా ఉండాలంటే మీరు ఓటు ప్రాధాన్యతను తెలుసుకొని ముందుగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.
విద్యార్థులు ముందుతరాల వారికి ఆదర్శవంతంగా ఉండాలని మీ అమూల్యమైన ఓటు హక్కుతో మంచి నాయకులను ఎన్నుకునే వారవుతారని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. అనంతరం ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ వక్తలు టీడీపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు, టీడీపీ నాయకులు పిఎంజే బాబు, నెహ్రూ యువ కేంద్రం (మై భారత్) డి.డి. ఉజ్వల్, వైయస్సార్ సిపి నాయకులు శంకర్రావు, కాంగ్రెస్ నాయకుల ఈశ్వరి, ఈ సమావేశంలో ఓటు హక్కు ప్రాముఖ్యత వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం ఎస్సే రైటింగ్ ఎలక్షన్స్ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలను మెమొంటోలు బహుకరించారు. సీనియర్ సిటిజన్సను దుశ్యాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి. లక్ష్మణమూర్తి, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, నెహ్రూ యువ కేంద్రం, డి.డి. ఉజ్వల్, కలెక్టర్ కార్యాలయ సి. సెక్షన్ సూపర్డెంట్ రాజేశ్వరరావు,బిజెపి జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు, టీడీపీ నాయకులు రిటైర్డ్ ఆర్డిఓ, పీఎంజే బాబు, వైఎస్ఆర్సిపి నాయకులు శంకర్రావు, కాంగ్రెస్ నాయకురాలు ఈశ్వరి, కాకినాడ ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల, శ్రీకాకుళం,కాకినాడ శ్రీ ఆదిత్య కళాశాల, శ్రీకాకుళం, శివాని ఇంజనీరింగ్ కళాశాల చిలకపాలెం, గాయత్రి విద్యా కళాశాల గురజాడ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల శ్రీకాకుళం, కమాండెంట్ ఎన్సిసి 14, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల శ్రీకాకుళం, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల శ్రీకాకుళం నుండి విద్యార్థిని, విద్యార్థులు ఇతర అధికారులు ఈ కార్యక్రమనకు యాంకర్ గా వ్యవహరించిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
