కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి..

కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి..
ప్రైవేట్ కళాశాలలో ఎంసెట్, నీట్, జెఈ ఈ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి..
అనుమతులు లేకుండా విద్యార్థులు తల్లిదండ్రులకు రసీదులు ఇవ్వకుండా దోపిడీపై చర్యలు తీసుకోవాలి..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని అన్ని ప్రైవేట్ కళాశాలలో జేఈ ఈ,నీట్ ఎంసెట్ వంటి కోచింగ్ ల పేరుతో వేలకు వేలు రూపాయలు వసూలు చేస్తున్న కళాశాలలను సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఇంటర్మీడియట్ అధికారిని కోరారు.జిల్లాలో విద్యా వ్యాపారం ఆపి కోచింగ్ సెంటర్ల లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. శనివారం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్ నాయక్ కు ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రిస్వామి, నాయకులు వినతి పత్రాన్ని ఇచ్చారు.మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలో విద్య ను వ్యాపారంగా చేస్తూ ఎంసెట్ నీట్ జెఈఈ వంటి కోచింగ్ ల పేరుతో వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని, వీటికి రసీదులు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా పరిమిషన్లు లేకుండా అనుమతులు తీసుకోకుండా వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యను అంగడి సరుకు లాగా మారుస్తున్నా కోచింగ్ లంటూ స్పెషల్ కోచింగ్ లో మెటీరియల్స్ వంటి వాటిపై అదనపు ఫీజులు వసూలు చేస్తూన్నారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కళాశాల తనిఖీలు చేసి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కళాశాలలో సీజ్ చేయాలని లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిద్దు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
